*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Tuesday, November 30, 2010

ఓ నక్షత్రమా !

ఓ అందరాని నక్షత్రమా !

నీ వెలుగు నాకు

నా నీడ నీకు 

నీ అందం నాకు

ఇవన్నీ ఇస్తావా?

ఓ పాల నక్షత్రమా!

***

పి.మమత, 6 వ తరగతి, విద్యావనం. రిషీవ్యాలీ పల్లె బడి , 2005.
పట్టుపువ్వులు ,పిల్లలకలాలు సంకలనం నుంచి
***


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Monday, November 29, 2010

పూనకం పోకడ!

మా వూరు పేరు తుమ్మచెట్ల పల్లి.
ఒక రోజు మొలకలపున్నమి వచ్చింది.
ఆ రోజు సూర్యగ్రహణం పట్టింది.
ఆ రోజు పూజారి పూజ చేస్తుండగా మారెమ్మ అతనిలోకి చేరింది.

అప్పుడు పూజారి వేపాకు తింటూ ఉంటే పూనకం వచ్చింది.
అప్పుడు పొట్టేలిని నరికేసారు.పూజారి రకం తాగాడు.కోడితల కొరికి విసిరేశాడు.
అప్పుడు ప్రజలంతా భయపడ్డారు.

అప్పుడు మాఇంటికి వచ్చి పై నుంచి కిందికి దూకాడు. ఒక ఆయనను వేప ఆకులతో కొట్టాడు. "ఏంటి నీ కోరిక?" అని పూజారి అతనిని అడిగాడు.

"వానలు పడడం లేదు . మా పంటలు సక్రమంగా పండలేదు."
అప్పూడు పూనకం వచ్చిన వ్యక్తి "ఈ నెల తరువాత పడుతాయి" అని చెప్పాడు.

మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసాడు.అప్పటి నుంచి అతను సంతోషంగా ఉన్నాడు.
అతడు చేతులో కర్పూరం పెట్టుకొని ముట్టించుకొన్నాడు.

మారెమ్మ తమ్ముడు పోతులురాజు మారెమ్మ ముందు ఉన్నాడు. అందరి  గంగమ్మల ముందు పోతులరాజు ఉంటాడు. పోతులరాజు కూడా ఒక ఆయనకు వస్తుంది.

ఇద్దరికీ పూనకం వస్తుంది.
అలా ఆయనకు వస్తూనే ఉంది.
వాన మాత్రం రాలేదు !

***
బి. రాజేంద్ర ,6 వ తరగతి, విద్యావనం  ,2005,
***
పట్టుపువ్వులు ,పిల్లలకలాలు సంకలనం నుంచి.


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, November 28, 2010

హాయి హాయిగా

చంద్ర మండలం లోకి వెళితే ..

అక్కడ అందరికీ ఇండ్లు కట్టిస్తా

త్రాగడానికి బోర్లు వేస్తా

గ్రహాలన్నింటినీ నింపేస్తా.

మంచి పండ్లను కాయిస్తా

తినడానికి ఆహారం వాటి నుంచి సంపాదిస్తా.

అక్కడే జీవితం హాయిగా గడిపేస్తా.

***
విష్ణు  5 వ తరగతి, విద్యావనం, రిషీ వ్యాలీ పల్లె బడి.

< పట్టుపువ్వులు , పిల్లల కలాలు సంకలనం నుంచి.2005>
***


Prabhava,Books and Beyond ! * All rights reserved.

నేను

నేను
చెట్లో నుంచి పుడతాను.

పుట్టిన తరువాత పువ్వుగా మారుతా
పువ్వు తరువాత పిందెకు వస్తా

పిందె తరువాత కాయను అవుతా
కాయ తరువాత పండుకు వస్తా

పండు తరువాత మార్కెట్ కు చేరుతా
ఆ తరువాత కడుపులోకి వస్తా
***
యస్ .వాసుదేవ రెడ్డి, హరిత వనం ,2005, ఆరో తరగతి


***
 "పట్టు పువ్వులు " పిల్లల కలాలు " సంకలనం నుంచి.
రిషీవ్యాలీ పల్లె బడి (REC) వారికి ధన్యవాదాలతో.



Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, November 23, 2010

ఒక చిన్న గాంధి

 బాలోత్సవ్  కథారచన -2010 లో జూనియర్ విభాగంలో ద్వితీయ  బహుమతి పొందిన  కె. అభిజ్ఞ ,
6 వ తరగతి ,   రచన.
***
ఒక చిన్న గాంధి 
***

ఒక రోజు నేను పాఠశాల నుండి వస్తుండగా  నాకు గాంధి వేషంలో చిన్న కుర్రాడు కనిపించాడు . నేను అతన్ని చూడగానే పాఠశాలలో వేషం వేస్తున్నాడు అనుకొన్నాను
కానీ, తీరా చూస్తే ,అతను ఒక భిక్షగాడు. అతను డబ్బులు అడుగుతున్నాడు. అంత చిన్న వయసులోనే అతనికి ఎందుకు డబ్బులు కావాలి?
అప్పుడు నేను చిన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగాను," నీవు ఎందుకు డబ్బులు అడుగుతావు  వాటితో నీకు ఏమి అవసరం ? ఎందుకు వేషం వేసుకొని డబ్బులు అడూగుతున్నావు? " అని అడిగాను
అప్పుడు చిన్న కుర్రాడు ఇలా సమాధానం ఇచ్చాడు. "నా పేరు సోము. నా వయసు ఏడేళ్ళు . నాకు మీలాగానే పిల్లందరితో కలిసి పాఠశాలకు వెళ్ళి ఆడూకొని ఆనందాలు ,బాధలు అన్ని విషయాలు పంచుకోవాలి అనిపిస్తుంది . కానీ దురదృష్టవశాత్తు , నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను. మా అమ్మానాన్నలు నన్ను ఎంతో ప్రేమగానో చూస్తారు. కానీ ,మా కుటుంబం ఒక బువ్వ కూడా నోటిలో పెట్టలేని పరిస్థితి లో ఉన్నది.
మా నాన్నకి నేను నాలుగు ఏళ్ళప్పుడే పక్షవాతం అచ్చింది. మా అమ్మ ఏమీ చేయలేక చిన్న చిన్న ఇంట్లో పని చేస్తుంది. రోజుకి పదిరూపాయలు కూడా రావడం లేదు. ఇక నేను బాధలు భరించ లేక ఇలా వీధుల్లో వేషాలు వేస్తూ కొన్ని మాటలు చెపుతూ ,ఇలా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాను.
కానీ, నేను ఏమాత్రం డబ్బులతో సరిపడ లేక పొతున్నాను.నాకు చదువుకోవాలని ఆశగా ఉంది. కాకపోతే నా పరిస్థితి అలాంటిది కాదు."
అప్పుడు నేను ఒక సలహా ఇచ్చాను." నువ్వు గవర్నమెంట్ పాఠశాలకు వెళ్ళి చదువుకోవచ్చు కదా?" అని అన్నాను.
"నేను చదువుకొంటే నా కుటుంబాన్ని పోషించేవారు ఎవరు ?"అని ఏడుస్తూ అన్నాడు.
అప్పుడు నాకు అతన్ని చూడగానే ఇలాంటి వారు ఎంతమందో ఉంటారు .నాకు ఏదో చేయాలి అనే తపన ఏర్పడింది. "వాళ్ళే రేపటి మనదేశానికి పౌరులు కావచ్చు " అని అనిపించింది
అపుడు నేను మా తల్లిదడ్రుల దగ్గరికివ్ ఎళ్ళి మా నాన్న తో ఇలా అన్నాను. " నాన్నా ,నీకు ఉద్యోగం ఉంది కాబట్టి నన్ను మన కుటుంబాన్ని పోషిస్తున్నావు. నన్ను చదివిస్తున్నావు. కానీ, పేద కుటుంబంలో పుట్టిన పిల్లల సంగతి ఏమిటి ?
వాళ్ళు చదువుకోలేరు కదా.రోజూ పనిచేయాలి. వాళ్ళని మనం చదివిద్దామా?'" అని అడిగాను.
" నీ ఆలోచన బావుంది . కానీ ,నేటికాలంలో చదివిస్తా అని పిలిచినా రానటువంటి పరిస్థితిలో ఉన్నారు . వాళ్ళకి చిన్నగా చదువు మీద ఉన్న శ్రద్ధ పోతుంది .  వాళ్ళకి అలా గాలికి తిరగడమే నచ్చేస్తది "" అని అన్నారు.
నిజంగానే సోముకి రెండు నెలల తరువాత చదువు మీద శ్రద్ధ వెళ్ళిపోయి ,అలా వేషాలతోనే తిరిగాడు. అతనికి రోజుకి 50 ఎక్కువనే డబ్బులు వస్తున్నాయి .
కానీ, అతను చదువుకోవడం లేదు.
నాకు అర్ధమైంది ఏమిటంటే, పరిస్థితులను బట్టి , కాలాలను బట్టి , మనుషులుకూడా మారుతారు.

***
బాలోత్సవ్  కథారచన -2010 లో జూనియర్ విభాగంలో 2 బహుమతి పొందిన  కె. అభిజ్ఞ ,6 వ తరగతి , తేజ టాలెంట్ స్కూల్, కోదాడ ,నల్గొండ జిల్లా. 
రచన.
13-11-2010.

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, November 20, 2010

అడవిలో బాలుడు



wallpaperstock.net
  బాలోత్సవ్  కథారచన -2010 లో జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి పొందినఎం. శ్రీకాంత్ ,మణుగూరు   చన .
 అడవిలో బాలుడు

***
అనగనగా ఒక ఊరిలోఒక రాజు అనే అబ్బాయి ఉండే వాడు. ఊరికి దగ్గరగా ఒక చిట్టడవి ఉండేది. రాజునాన్న అడవికి వెళ్ళి తేణె సేకరించేవాడు
ఒక సారి రాజు నాన్నకు బాగా జ్వరం వచ్చింది
రాజు నాన్న ," అడవికి వెళ్ళి నువ్వు తేనె తేవాలిఅప్పుడే మనం డబ్బు సంపాదించుకోవాలిఅన్నాడు.
రాజు ఒక బుట్టను ,కత్తిని ,అగ్గిపెట్టెను తీసుకొని అడవికి వెళ్ళాడు
అతడికి తేనె తెట్ట కనిపించ లేదు
సాయంత్రం అయినా అతనికి తేనెతెట్ట కనిపించలేదుఅతడు ఇక వెళ్ళి పోదాం అనుకొన్నాడుఅతనికి దారి తెలియదు.  

తేనె కోసం అతడు అడవి మొత్తం తిరుగుతూ ,ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ,సేద తీర్చుకొన్నాడు
రోజు రాత్రి అతడు అక్కడే ఉన్నాడు, రాజు నాన్న అతడు ఇంకా రాలేదని అడవిలో ఏదైనా మృగం అతన్ని చంపేసిందేమో నని భయపడ్డాడు
రోజు రాత్రి అతనికి నిద్ర పట్టలేదు.  
bengalnewz.blogspot.com
రాజు అడవిలో తప్పి పోయాడు. రాజుకు బాగా చలి వేసే సరికి ,తన దగ్గర ఉన్న కత్తితో ఎండు కట్టేలు నరికి అగ్గిపెట్టెతో మంట వేశాడు. కొంతసేపు నిద్రపోయాడు
పొద్దున్నే లేచి తన ఇంటికి వెళదాం అనుకొన్నాడు.
రాజు నాన్న జ్వరంతో ఉండడంతో తన కొడుకును వెతకడానికి రాలేక పోయాడు
రాజు అడవిలో మళ్ళీ తేనె తుట్టెలు వెతికాడు. సారి అతనికి తేనె తుట్టె కనిపించింది. మంటపెట్టి తేనె టీగలను తరిమి ,తెట్టెబు కత్తితో కోసి ,తేనెను బుట్టలోకి పిండాడు. మధ్యాహ్న సమయంలో రాజు తేనె తాగి ఆకల్ని తీర్చుకొన్నాడు
అక్కడ వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడని రాజు బాధ పడ్డాడు
రాజు మూడిటిని తీసుకొని ,ఒక దగ్గర కూర్చుని ,కత్తితో కట్టే పుల్లలను నరికి ,ఒక డేరాలాగా ఏర్పాటు చేసుకొన్నాడు. ఎందుకంటే రోజు సాయంత్రం వర్షం బాగా కురిసింది
ప్రొద్దున్నే లేచి రాజు ఆలోచించి ,"నేను అడవికి వచ్చినప్పుడు కత్తిని ఒకసారి, బుట్టను ఒకసారి నేల మీద అప్పుడప్పుడు పెట్టాను.అంతే గాక అగ్నిని కూడా మండించాను."
గుర్తులను వెతుకు కుంటూ అడవి మొత్తం తిరుగగా ,అతనికి ఒక దగ్గర అతడు కాల్చిన కట్టె పుల్లలు కనిపించి , దారినే ఇంటికి వెళ్ళగా ,బుట్టగుర్తు కత్తి గుర్తు ఉంది
అక్కడినుంచి అతడు వెళ్లి పోయాడు.
అతడు ఒకవేళ మూడు వస్తువులను ఉపయోగించకపోయుంటే , అతడు ఇంటికి చేరుకొనే వాడు కాడు
ఇంటికి వచ్చిన అతనిని చూసి వాళ్ళ నాన్న ఎంతో సంతోషించాడు.
***
బాలోత్సవ్  కథారచన -2010 లో జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి పొందిన రచన.
13-11-2010.

Prabhava,Books and Beyond ! * All rights reserved.