*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Tuesday, August 31, 2010

ఒక రోజు మధ్యాహ్న సమయంలో

అది వేసవి కాలం.
ఎక్కడ చూచినా చెట్లు
ఆకులు రాల్చాయి.
నీటి బావులు ,సరస్సులు
ఎండమావులుగా మారిపోయాయి

జనులు నీరు లేక అల్లాడుతున్నారు.
పంట పొలాలు వాడి పోయాయి.


నేను సూర్యుడిని కదా,
నన్ను ఏమీ చేయ లేరు.

ఈ కష్టాలన్నీ అనుభవించి చూశాను. 
నా మీద నాకే అసహ్యం వేసింది.

***
వాసుదేవ, 6 వ తరగతి,విద్యా వనం , రిషీవ్యాలీ పల్లె బడి.




Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, August 20, 2010

రామయ్య నాగలి

బాలోత్సవ్ -2009, కొత్తగూడెం ,కథారచన లో సీనియర్లలో ప్రథమ బహుమతి పొందిన కథ. 
*

అనగా అనగా ఒక ఊరు.
ఊరి పేరు అమరావతి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్నది. అమరావతిని ఆనుకొని చిన్న గ్రామం ఉన్నది. అది రంగయ్య పాలెం.
ఊరును ఆనుకొని గలగలా కృష్ణమ్మ  పరుగులు వేస్తుంది.
  ఊర్లో అన్నీ పనులకు పెద్దదిక్కు కృష్ణమ్మే,పిండ ప్రదానానికైనా ,మంచి నీటికైనా ,పొలం పనులకైనా,పడవ కట్టాలన్నా,పూట గడవాలన్నా ఊరికి కృష్ణమ్మే ఆధారం.
పొద్దున్నే కోడికూతతో మొదలవుతుంది ప్రయాణం ,కోయిల కుహూ కుహూ రాగాలతో ,తుమ్మెదల ఝుం ఝుం రాగాలతో ,ఉడుతుల ఊగిసలాటతో  ,పిలగాల్ల గోలతో ,పెద్దాళ్ళ పందాలతో ..ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందా ఊరు.
ఊరి  మధ్యలో ఉంది గ్రామ దేవత పోలేరమ్మ. గద్దె దగ్గర దసరా తొమ్మిది రోజులూ జాతరే. చుట్టు పక్కల ప్రాంతాల వారంతా అక్కడికి రావలసిందే.అదీ అక్కడి ఆచారం.
జాతరకు కావాల్సిన రంగుల రాట్నం,చెక్క బొమ్మలు ,దేవుళ్ల  ప్రతిమలు ,భోజనానికి బల్లలూ ,కుర్చీలు ,ఉట కొట్టే కొమ్మలు ..ఒక్కటేమిటి అన్నింటికీ రామయ్యే దిక్కు.
" అన్నట్లు రామయ్య దశరా ఇంకా నెల రోజులే ఉంది. సామాన్లు ఇంకాస్త నాణ్యంగా చేయి,పాలీషు కోసం మొహమాటం పడకు .సర్పంచుని నేను చెప్తున్నా" ఆంజనేయులు ఆరాటం.
"అట్టాగే అయ్యగారు" రంగయ్య ఓదార్పు.
ఇదీ సంగతి.రామయ్యకు ముగ్గురు కూతుళ్ళు,ఇద్దరు కొడుకులు,భార్య.కొడుకులిద్దరికీ కర్ర కోయడం ,మొద్దు కొనడం ,అమ్మడం లాంటి చిన్నపాటి పనులు చేస్తూ రామయ్యకు చేదోడు వాదోడుగా ఉంటారు.
ఇంటిల్లిపాదికీ రామయ్య ఒక్క రెక్క సంపాదనే దిక్కు.అయినా ఇంట్లో లోటూ ఉండదు. ఎందుకంటే రామయ్య చేతి మహిమ అలాంటిది.
దసరా ఉత్సవాలు ముగిసాయి.రామయ్య కూ గిట్టుబాటు దిట్టంగానే ముట్టింది.ఆంజనేయులు గారు హాయిగా ఊపిరి పీల్చుకుంటూ మీసాలు మెలేస్తున్నారు.కాదు మరీ అంతా ఆయన చలవే  గదా!
రోజులు ఒక్కలా ఉండవు.
తొలకరి  వచ్చే వేళయ్యింది.కానీ ,మేఘుడు కరుణించ లేదు.
వారాలు నెలలు పక్షాలు గడుస్తున్నాయి.అయినా దేవత కరుణించ లేదు.
వర్షం కోసం కోళ్ళను బలులిస్తున్నారు .అయినా పోలేరమ్మ కనికరించలేదు.
రైతన్న విత్తనం వేయడానికి జంకుతున్నారు.
రోజు రోజుకీ పరిస్తితి దిగజారుతోంది.భూములు బీటలు వారుతున్నాయి.ఎద్దుల డొక్కలు మాడి పోతున్నాయి.
  చుక్క నీరు లేదు.కృష్ణమ్మ మొఖం చాటేసింది.చుక్క నీరు లేదు పొమ్మంది.
సంక్రాంతి లోపు పిల్లాపాపలతో మనుమలు మనవరాళ్ళ అల్లరితో ,అల్లుళ్ళతో చిరు గొడవలు ,కోడళ్ళ కోరికలు,అరిశల రుచులతో నిండుగా ఉండాల్సిన ఇల్లు బోసిపోయింది.
రామయ్య ఆరోగ్యం క్షీణించింది.
మనిషి బక్కగా పాలి పోయాడు.చేయి ఉలిని పట్టనంది.మనస్సు పని మీద లగ్నం కావడం లేదు. కరువు ధాటికి ప్రక్క ఊర్లో ఉంటున్న అల్లుళ్ళు పొలం దున్నలేమంటూ రామయ్య ఇంట్లో మకాం వేసారు.
తనకే దిక్కు లేదు మరి బంధువులో !
భార్య బంగారం తాకట్టు పెట్టింది.కన్న కొడుకులు కూలి పని చేస్తున్నారు. వొచ్చిన సొమ్మంతా మందులకే.
సర్కారోళ్ళు చేతి వృత్తుల్ని ఆదుకొంటామని చెప్పి రోజులు గడిచాయి.కానీ, ఆచరణలో అడుగే ముందుకు పడలేదు.పూట గడవడమే కష్టంగా ఉన్నది.
ఆరోజు రాత్రి వర్షం కురిసింది.రామయ్యకళ్ళు ఆనందంతో మెరిసాయి.రేపట్నుంచి రైతులు వస్తారు.నాగళ్ళు చేయాలి.గొర్రులు చేయాలి.కొడవళ్ళు పిడులు పట్టాలి.కొయ్యల్ని తీసుకు రావాలి.ఇక తిండికి లోటుండదు.
కానీ  విధి వక్రించింది. రామయ్య రాత్రి వేళలో బాగా దగ్గు తున్నాడు. కొడుకులు ఎడ్ల బండి మీద బొంత కప్పి ,ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని , ఆసుపత్రికి తీసుక పోతున్నారు.
అసలే సత్తువ లేని ఎడ్లు కూలబడ్డాయి.ఇక తాము మోయలేమని చేతులెత్తేసాయి.
రామయ్యను తమ భుజాలపై ఎత్తుకెళుతున్నారు అతని కొడుకులు .
దవాఖానా చెరారు.కానీ డాక్టరు నిద్ర పోతున్నాడు.అతను నైట్ డ్యూటీలోనే ఉన్నాడు కానీ పిలిచినా పలకడు.ఎట్టకేలకు నిద్ర లేచినాడు,కానీ పెద్దవాళ్ళు చూడకుండా లంచం ఇవ్వమన్నాడు. పది కాదు ఇరవై కాదు .అయిదు వందలు .అవికాక మందులకు వేరే ఖర్చు. డబ్బు కట్టలేదు.
పువ్వు రాలి పోయింది. ఇన్నాళ్ళు ఊరికి చెదోడు వాదోడు గా ఉన్న నాగలి రామయ్య తుది  శ్వాస విడిచాడు.చుట్టూ ఉన్న ఊరి  వాళ్ళు కానీ ,సర్కారు కానీ ఆపలేక పోయింది నిండు మనిషి ప్రాణాలను.
కృష్ణమ్మ గలగలా పారుతోంది తనకేమీ సంబంధం లేనట్టు.
ఒడ్డుపై రామయ్య చితిని పెట్టారు.పెద్దకొడుకు అయ్యగారు చెప్పినట్లే కర్మ కాండ జరిపించాడు.రామయ్య అంతిమ యాత్రకు ఊరంతా వచ్చింది.
సర్పంచి ఆంజనేయులు కంట తడి పెట్టాడు.తను మాత్రం ఏం చేయ గలడు?
రామయ్య పోయింతరువాత,కొడుకులు వారసత్వంగా అదే వృత్తిని స్వీకరించారు.పనిలేక, తిండి లేక, ఆరోగ్యం సహకరించక ,సర్కారు ఆదుకొనక తండ్రి మరణించాడు.
ఉన్న కొద్ది భూమినీ ప్రైవేట్ కంపనీలు దగా చేసి ,ప్లాస్టిక్ వస్తువులొచ్చి కొండపల్లి బొమ్మల్ను పొమ్మనిట్రాక్టర్లు నాగళ్ళను చీకొట్టి ,సర్కారు ఎలక్షన్ల తరువాత మొహం చాటేసి ..పీకల్లోతు కష్టాల్లో ..బ్రతుకు భారం మోస్తున్నారు.
మోస్తూనే ఉన్నారు!
***
వి.రవికాంత్ శర్మ ,
10 తరగతి,సింగరేణి పాఠశాల, ఇల్లందు.
14-11-2009

*
చిత్రం: కృష్ణ  వంశి , గ్రీష్మ ప్రభవ -2010, నెల్లూరు.

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Monday, August 16, 2010

Sky Sky

Sky Sky Sky
Where the birds fly high

You are blue in color 
But ,there in no clue,
To find where you flew.

You cannot be claimed by any
You cannot be clasped
Nor  made into clay.

You are present in every civic
with small or long lyric.

You are bigger than a mountain.
The mountain stains by seeing you.
*
M.Sai Rohith
7th class


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Who Am I ?

I am a super hero.

I am large and green.

I can jump very high.

Who am I ?
*
D.Pranav Reddy

 Hulk

Who Am I ?

I am of different colours and shapes.

My marks will be everywhere.
And,I write your marks,

I have longer life.
And, My life begins in a shop.


Who am I?
*
M.Sai Rohith
7th class


A Pen

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, August 14, 2010

ఒక చిన్న మొక్క

నేను ఒక చిన్న మొక్కను

నాకు ఎవరూ లేరు
నాకు ఎవరూ నీరు పోయరు

అందువలన వారికి కట్టెలు
ఇవ్వకపోతే అవుతుందా?

మరే !

*
పి.అరుణ్ వర్మ ,7 వ తరగతి.21-12-2006, విద్యావనం,రిషీ వ్యాలీ పల్లె బడి.





Prabhava,Books and Beyond ! * All rights reserved.

తీయతీయని తేనె

నేనే గనుక తేనె పట్టునయితే 
తీయతీయని తేనెనిస్తా

నన్ను రాయితో కొట్టిన వారిని
కనిపెట్టుకొని కుడుతా.

***


పి.అరుణ్ వర్మ ,7 వ తరగతి.21-12-2006, విద్యావనం,రిషీ వ్యాలీ పల్లె బడి.
*


Prabhava,Books and Beyond ! * All rights reserved.

చివరకు ఏమైంది?

అయ్యో! అయ్యయ్యో !
చెట్లా పాడా !

అడవులన్నీ నరుకుతున్నారు.
కట్టె కట్టె అంటారు.

అడవులన్నీ నాశనం చేస్తున్నారు.
చివరకు ఏమైంది?

గాలి కాలుష్యం అయింది.

***
పి.అరుణ్ వర్మ ,
7 వ తరగతి.
21-12-2006,
విద్యావనం,రిషీ వ్యాలీ పల్లె బడి.
*


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Wednesday, August 11, 2010

కథారచన -బాలోత్సవ్

క్రమం తప్పక ప్రతి ఏడాదీ కొత్తగూడెం క్లబ్ నిర్వహణలో జరిగే బాలోత్సవ్ ...ఒక పిల్లల పండగ.
అందులో కథ చెప్పడం,రాయడం, విశ్లేషించడం  ఒక ముఖ్యమైన భాగం.

గతఏడాది జరిగిన కథారచన కు ముందు, పిల్లలతో .. వోల్గా, వాసిరెడ్డి నవీన్, శిరంషెట్టి కాంతారావు,అక్కినేని కుటుంబరావు,భగవాన్, చంద్రలత, ముళ్ళపూడి సుబ్బారావు  తదితరులు మట్లాడారు.
కథారచనలోని మెళుకువల గురించి.విషయనేపధ్యాల గురించి. భాష గురించి. అనేకానేకం.

సుమారు వందకు పైగా కథకులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో కొన్ని రచనలను ఇకపై వరసగా మీరు చదవ వచ్చును.
 ఇవి పిల్లల రచనలు. మీ అభిప్రాయాలు సూచనలు వారిని కలాలను మెరుగు పరచడానికి ఎంతైనా         మార్గదర్శకాలు కాగలవు.ధన్యవాదాలు.
అందులో ఈ అద్బుతశక్తులు అన్న  రచన మొదటిది .

***
In the PHOTO (Lto R): 
శిరంషెట్టి కాంతారావు, వాసిరెడ్డి నవీన్,  వోల్గా, అక్కినేని కుటుంబరావు  గారలు మరియు   చంద్రలత .
***
డా. వాసిరెడ్డి రమేష్ గారు మరియు ఇతర పిల్లల శ్రేయోభిలాషులు, కొత్తగూడెం క్లబ్,కొత్తగూడెం వారికి నమస్సులతో ***.
Prabhava,Books and Beyond ! * All rights reserved.

అద్భుత శక్తులు

ఒకానొక ఊరిలో రాము అనే అబ్బాయి ఉండే వాడు.
అబ్బాయికి ఎప్పుడూ తనకు గొప్ప శక్తులు ఉండాలనీ , లోకాన్ని కాపాడాలనీ ,అందరూ తనని పొగడాలనీ ఒక కోరిక ఉండేది. కానీ అబ్బాయి ఎప్పుడూ తన కోరిక గురించే ఆలోచించే వాడు.


అతని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా అబ్బాయికి 
" అది ఎలాగు తీరని కోరిక . నువ్వు బాగా చదువుకొని కలెక్టరో ఇంజనీరో అయితే అందరూ నిన్నే పొగుడుతారు .కాబట్టి నువ్వు బాగా చదువుకో" అని ఎన్నో సార్లు చెప్పి చూశారు.
అయినా లాభం లేదు
కానీ ,వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం అబ్బాయిని ఎలాగైనా మార్చాలనుకొంటారు. బాగా ఆలోచిస్తారు  .వాళ్ళకు ఒక ఉపాయం తట్టింది.

అది అలా ఉండగా , అబ్బాయి రోజూ దేవుణ్ణి అద్బుతశక్తుల కోసం ప్రార్ధించడం మొదలు పెట్టాడు.


ఒక రోజు వాళ్ళ అమ్మానాన్న వచ్చి అబ్బాయితో ,"మేము తీర్ధ యాత్రలకు వెళుతున్నాము .నువ్వు ఇంట్లోనే ఉండు " అని చెప్పి తీర్ధయాత్రలకు వెళ్ళిపోతారు 

అలా అని వాళ్ళు నిజంగా వెళ్ళలేదు .వారిద్దరూ ఒక సాధువు ,భక్తురాలిగా వేషం మార్చుకొని ,తిరిగి వాళ్ళ ఊరు వస్తారు.

ఊరికి ఎవరో సాధువు  వచ్చారని ఎవరో చెపితే రాము విన్నాడు.

వెంటనే సాధువు వద్దకు వెళ్ళాడు రాము.వెళ్ళి సాధువుతో తన కోరికను చెప్తాడు. దానికి సాధువు "నువ్వు రెండేళ్ళు కష్టపడి చదువు అప్పుడు నీకే అద్భుతశక్తులు వస్తాయి "అని చెప్పాడు
అబ్బాయి సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు.

అప్పటినుంచీ ప్రతి రోజు కష్టపడి చదువుకొంటూ ఉంటాడు . వారం రోజుల తరువాత వాళ్ళ అమ్మానాన్న వస్తారు. అప్పటికే రాము చదువుకొంటూ ఉంటాడు. వాళ్ళు చేసిన కృషి ఫలించినందుకు వారు ఎంతో సంతోషించారు.

అయితే వారు ఇంటికి రాగానే ," అమ్మానాన్న రండి రండి " అంటూ వారిని ఇంట్లోకి ఆహ్వానించి ,జరిగిన విషయమంతా చెప్పాడు.

రెండేళ్ళు బాగా చదివాడు. అయితే ప్రతిసారీ ,క్లాసులో తనే ఫస్టు వచ్చేవాడు.అయితే రెండేళ్ళు అయ్యేసరికి అబ్బాయికి అద్భుత శక్తుల గురించి ఏదీ గుర్తు లేదు .
 బాగా చదివి గొప్పవాడయ్యాడు
అందరూ అతనిని పొగడసాగారు


ఒక రోజు అతనికి తన కోరిక గురించి గుర్తొచ్చింది.అప్పుడు సాధువు అన్న విషయం పూర్తిగా అర్ధమైంది. తన చదువు తన ఉద్యోగం వలన అందరూ అతనిని పొగుడుతున్నారు. అవే అతని  అద్భుత శక్తులు అని తెలుసుకొన్నాడు.

***

K. శ్రీ  సాయి సుమ స్మిత,
7 తరగతి,
బాలోత్సవ్- 2009, కథారచన, జూనియర్స్, ప్రథమ బహుమతి

***
డా. వాసిరెడ్డి రమేష్ గారు మరియు ఇతర పిల్లల శ్రేయోభిలాషులు, కొత్తగూడెం క్లబ్,కొత్తగూడెం వారికి నమస్సులతో  
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, August 8, 2010

A Rose Prick

A girl going on a plane
A rose pricked her.
She cried in pain 
A dog barked at her 
She cried even more
***
Pratheeka Reddy ,
7 years
**
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Cool Cool !!!!

I am  tiny.
People Enjoy sitting on me
I am green 
Animals eat me.
We Live in groups
Who am I ?
 *              
Prateeka Reddy
8years.
*
Lawn
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, August 6, 2010

పిల్లనగ్రోవి


పిల్లలు కనబడగానే
పాఠాలు మొదలు పెడతాం
అలా ఇలా..అదీ ఇదీ...
అంటూ!

పిల్లలు అనగానే-
చెపితే వినవలసిన వాళ్ళు-
నేర్పితే నేర్వవలసిన వాళ్ళు-
అనుకుంటాం!

పిల్లలు అంటే-
గాలిపటాలు,కాగితం పడవలు
పోకీమాన్లు ,మిక్కీమౌస్లు
చాక్లెట్లు మెర్రి-గో-రౌండ్లు
అంతేనా?

పిల్లలంటే -
భాష
భావం
సజీవ చైతన్యం

పిల్లలంటే -
దేదీప్యమాన కళలు
తేనెలతేటల మాటలు

అల్లిబిల్లిమాటలు
పిల్లనగ్రోవి పాటలు
పిల్లల కలాలు

పిల్లలు
చెపితే వినవలసిన వాళ్ళం
నేర్పితే నేర్వవలసిన వాళ్ళం 
మనం!

చంద్ర లత

pillana grovi ,(2006),Stories and Poems by Telugu students,Rishi Valley School
For copies : Rishi Valley School , Prabhava and all leading bookstores

***


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, August 1, 2010

పొయ్యిలో సూరీడు

మాంత్రిక శక్తి నాకు ఉంటే
సూర్యుణ్ణి చిన్నగా మార్చేస్తా
భూలోకమునకు దించేస్తా
పొయ్యిలో పడేస్తా
అన్నం వండేస్తా 
అందరికీ పంచేస్తా!

*

యస్.వాసుదేవ రెడ్డి,
5 వ తరగతి,విద్యావనం,రిషీవ్యాలీ
(2006)* పట్టుపువ్వులు సంకలనం నుండి


Prabhava,Books and Beyond ! * All rights reserved.